27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉచిత కంటి వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని ఆధ్వర్యంలో బుధవారం లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో 124 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి,  అవసరమైన వారికి కంటి చుక్కలు, నొప్పుల మాత్రలను లయన్స్ జిల్లా ట్వినింగ్ సెక్రటరీ లయన్ కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ వారి సహకారంతో ఉచితంగా అందజేశారు.  ఇందులో 16 మంది రోగులకు మోతి బిందు ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రి రాకాసిపేట్ బోధన్ వారికి రెఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ కె.వి మోహన్, జిల్లా ట్వినింగ్ సెక్రటరీ లయన్ కొయ్యాడా శ్రీనివాస్ గౌడ్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే, లయన్స్ కంటి ఆసుపత్రి కంటి నిపుణులు అజయ్ గౌడ్,  క్లబ్ కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, సభ్యులు లయన్ పుట్టి సాగర్,క్యాంప్ ఇంచార్జ్ హనుమంతరావు, గ్రామ పెద్దలు వంజరి బాలు, పుట్టి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article