బాన్సువాడ, బతుకమ్మ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బాన్సువాడ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్క్ర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. అంబేడ్కర్ చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సంఘం కో–ఆర్డినేటర్ అంబర్ సింగ్, మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్, లాయక్, అక్బర్, నాయకులు నిజాంద్దీన్, ఖదర్, అక్బర్, మొహమ్మద్ నసీముద్దీన్, షఫియుద్దీన్, యూనుస్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
