24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మల్కాపూర్ గ్రామంలో మహిళ హత్య

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట, బతుకమ్మ :  నవీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో మహిళ హత్య జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆకుల అనంత @ సోనీ (29) గతంలో భర్తతో విడిపోయి, తన తల్లి ఒడ్డెమ్మతో కలిసి నివసిస్తుంది.  ఈ నేపథ్యంలో వరుసకు మామయ్య అయ్యేమోస్రాకు చెందిన పాండవుల సాగర్ (27) డబ్బుల కోసం అనంతను  ఆమె తల్లిని వేధించ సాగాడు.  మంగళవారం  సాయంత్రం అనంత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సాగర్ ఆమెతో గొడవపడి, గొంతు పిసికి హత్య చేసి, బంగారం తీసుకొని వెళ్లినట్లు మృతురాలి తల్లి ఒడ్డెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన నవీపేట్ పోలీసులు, నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో నేరస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Woman murdered in Malkapur village

More articles

Latest article