మోర్తాడ్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రతి విషయంలో విద్యార్థులను నిష్ణార్ధులు చేయడం జరుగుతుందని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనం వంటశాలను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని వంట గది, పాత్రలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో సంబంధిత సబ్జెక్టుల విషయంలో పలు విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పెద్ది సంతోష్ కుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

