26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జీవదాన్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

డయాబేటిస్ వ్యాధి నయం కాకపోవడంతో జీవితపై విరక్తి చెంది వ్యక్తి అత్మహత్యకు పాల్పడ్డారు.  తాను చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలో బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలుకు గత వారం రోజుల క్రితం చేయికి గాయమైంది. దీంతో అది ఇన్ఫెక్షన్ కావడంతో చికిత్స నిమిత్తం జీవధాన్ ఆసుపత్రిలో చేరాడు. అయితే షుగర్ తగ్గకపోవడంతో గాయం అధికమై తీవ్ర మనస్థాపానికి గురై సాయిలు ఆస్పత్రిలోని బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

More articles

Latest article