26.6 C
Hyderabad
Monday, August 3, 2026

దోపిడీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ బస్టాండ్ వద్ధ వ్యాపారిపై బ్లేడ్ లతో గాయపరిచి సెల్ పోన్ ఎత్తుకేళ్లిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ పూసల గల్లీకి చెందిన దేవసి దాల్రాం వ్యాపార రీత్యా ఈ నెల 28న నందిపేట్ వెళ్ళినాడు. శనివారం రాత్రి తిరిగి నిజాంబాద్ బస్టాండ్ కి సాయంత్రం 6 గంటలకు బస్సు దిగి బయటకు వస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుండి బ్లేడ్ తో దాడి చేసి అతని వద్ద నుండి మొబైల్ అపహరించారు. ఈ క్రమంలో బాధితుడు గాయాలకు గురైనాడు. బాధితుడి ఫిర్యాదు పై కేసు నమోదు చేసి న టౌన్ వన్ పోలీసులు అదివారం నిందితుల్లో ఒకరైన ఆర్మూర్ శాస్త్రి నగర్ కు చెందిన షేక్ ఆరీఫ్ ను బోధన్ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి మొబైల్ ను రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

More articles

Latest article