26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అభివృద్ధికి కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఇవ్వవలసిన 450 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధికి కృషి చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ భవనంలో  ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆకుల పాపయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి కి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆదివారం న వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. దేశంలో ఈనాటికీ విత్తన చట్టం లేదని కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకురావాలని దేశంలో ప్రవేట్ విత్తనాల కంపెనీలవే పేత్తనం కొనసాగుతుందని నేటికీ 90% విత్తనాలు బహుళ జాతి కంపెనీలు కార్పొరేట్ కంపెనీల విత్తనాలు సప్లై చేస్తున్నాయని అన్నారు. అవి నాసిరకం కల్తీ విత్తనాల మూలంగా రైతులు నిండా మనుగుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ద్వారానే రైతులకు సర్టిఫైడ్ విత్తనాలను అందించాలని అన్నారు. తెలంగాణ సంస్థకు ప్రభుత్వం ఇవ్వవలసిన  450 కోట్ల  బాకీ రూపాయలు ఇవ్వనందున ప్రతినెల ఆ సంస్థ మూడు కోట్ల రూపాయల వడ్డీలు కట్టవలసి వస్తుందని అన్నార. ఎన్సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వమే తెరిపించి నడిపించాలని దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని అన్నారు. దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉన్నందున దానిపై జిఎస్టి కూడా లేనందున ఫ్యాక్టరీని నడిపినట్లు అయితే బాగుంటుందని అన్నారు. రైతులంతా చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని అందుకు ఈ ఫ్యాక్టరీ నడిపించినట్లయితే అటు రైతులకు ,కూలీలకు 20,000 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో అఖిలభారత రైతుకులి సంఘం ఏఐకెఎమ్ఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, పార్టీ జిల్లా డివిజన్ నాయకులు నీలం సాయిబాబా, శివకుమార్, ఐఎఫ్టియు నాయకులు డి.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article