27 C
Hyderabad

బస్సులో నుంచి జారి పడి వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 భిక్కనూరు, బతుకమ్మ : ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జంగంపల్లి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బస్సులో ఉన్న ప్యాసింజర్ తెలిపిన సమాచారం ప్రకారం.. అనిశేట్టి స్వామి(44) హైదరాబాదు నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్సులో వాంతులు వస్తున్నాయని  బస్సు డ్రైవర్ ను  డోర్ తీయమని అడిగాడు.  దీంతో  డోర్ తీయగా ప్రమాదవశాత్తు బస్సులో నుంచి  కాలుజారి రోడ్డుపై పడ్డాడు.  అతని తలకు గట్టిగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Man dies after falling from bus

More articles

Latest article