25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బంగారం, నగదు చోరీ చేసిన మహిళ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీలో తాను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్ పై అంతస్తులోని ఇంటిలో చోరీలకు పాల్పడ్డ మహిళలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఒ రఘుపతి తెలిపారు. కుమార్ గల్లిలో నివాసం ఉండే గంగా విషన్ ఇంటిలో ఈనెల 13న  బెడ్ రూం లోని సేఫ్ లాకర్ లో బంగారం, నగలను ఉంచగా చోరీకి గురి అయ్యాయి. అప్పటికే ఇంటిలో నగదు చోరీకి గురి అవుతుండటంతో అనుమానంతో గంగా విషన్ తన ఇంటిలో రహస్య కెమెరాలను అమర్చాడు. అక్కడ సీసీ టీవి పుటేజీలను పరిశీలించగా గంగా విషన్ భవనంలోని మొదటి అంతస్తులోని  సౌజన్య బ్యూటీపార్లర్ లో పనిచేసే రాచకొండ హరిక  అలియాస్ గాయత్రి దొంగతనం చేసినట్లు గుర్తించారు. గత కొంత కాలంగా హరిక గంగావిషన్ కుటుంబ సభ్యులతో స్నేహం చేసింది. అదే సమయంలో ఇంటి తాళాలకు డూప్లికేట్ చేయించి దాచింది. ఇటీవల ఇంటి యాజమాని ఇంటికి తాళం వేసి వెల్లగా చోరీకి పాల్పడింది. శనివారం హారిక అలియాస్ గాయత్రిని అరెస్టు చేసి ఆమే వద్ద ఎనిమిది తులాల బంగారం,1300 గ్రాముల వేండి, 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్హెచ్ ఓ రఘుపతి తెలిపారు.

More articles

Latest article