బతుకమ్మ,మోర్తాడ్: సోమవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పాల్గొంటారని బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి తెలిపారు. ఉదయం 10:00 గంటలకు మోర్తాడ్ మండల కేంద్రంలో, ఉదయం 11:00 గంటలకు భీంగల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
