24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒంటరి మహిళ దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి కథనం ప్రకారం..  బిచ్కుంద మండల కేంద్రంలో  గోనే కాశవ్వ ( 60 )  అనే మహిళ ఒంటరిగా జీవనం సాగిస్తోంది.  ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను దారుణంగా హత్య చేశారు. చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా కాశవ్వ రక్తం మడుగులో పడి ఉంది.  కేసు నమోదు చేసి అనుమానితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article