24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సమయపాలన పాటించని పంచాయతీ కార్యదర్శులు

Must read

📰 Generate e-Paper Clip

  • అడిగేది ఎవరు.. ఆపేదెవరు..

 

బతుకమ్మ, బిచ్కుంద : గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగడంలేదని, వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో కార్యదర్శులు సమయపాలన పాటించడం లేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో పలు గ్రామాల కార్యదర్శులు పట్టపగలే పట్టణాల బాట పడుతున్నారు. పల్లెల్లో పౌరులు పొలం పనులకు వెళ్ళగానే కార్యదర్శులు గ్రామాలు విడిచి వెళ్లిపోవడం పరిపాటిగా మారినట్లు ఆరోపణలు వెలివెత్తుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు గ్రామాలకు చేరుకోవడం గంటలోపే మండల ఆఫీసులో పని ఉన్నట్లు చెబుతూ ఇంటి బాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంత జరుగుతున్న ఉన్నత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పలు గ్రామాల కార్యదర్శులు సమయం దాటినప్పటికిని కార్యాలయం లకు చేరుకోవడం లేదని బతుకమ్మ ప్రతినిధి ఎంపీడీవో గోపాల్ ను వివరణ కోరగా మండలంలో ప్రతి కార్యదర్శి సమయపాలన పాటించాల్సిందేనని సమయపాలన పాటించని కార్యదర్శులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More articles

Latest article