27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జనని సెషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్వో

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల జనని సెషన్ ను డిఎంహెచ్వో డా.రాజశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించే ఔట్రీచ్ జననీ సెషన్ల కార్యక్రంలో భాగంగా చంద్రశేఖర్ నగర్ కాలనీ లోని అంగన్వాడీ కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి వ్యాక్సిన్ల నాణ్యతను ఐస్ ప్యాక్లను పరిశీలించారు. రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి చిన్నారి టీకాలు 100 శాతం పూర్తిచేయాలని, అర్హులై ఉండి ఇంకా వ్యాధి నిరోధక టీకాలు తీసుకొని వారిని పేరుపేరునా పరిశీలించి పర్యవేక్షించి టీకాలు ఇవ్వాలని కోరారు.  పట్టణ ఆరోగ్య కేంద్రంలో రికార్డులను రిపోర్టులను హాజరు పట్టికను పరిశీలించి మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందేలా చూస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా అసంక్రమిక వ్యాధులను నిరంతరం పరీక్షిస్తూ చికిత్స అందించాలని తెలిపారు. పిఎస్సి ల వారిగా కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శిఖర, ఏఎన్ఎం సావిత్రి, ఆశా కార్యకర్తలు, పిహెచ్స్సి సిబ్బంది పాల్గొన్నారు.

DMHO conducts surprise inspection of maternity session

More articles

Latest article