జనని సెషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్వో
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల జనని సెషన్ ను డిఎంహెచ్వో డా.రాజశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహించే ఔట్రీచ్ జననీ సెషన్ల కార్యక్రంలో భాగంగా చంద్రశేఖర్ నగర్ కాలనీ లోని అంగన్వాడీ కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి వ్యాక్సిన్ల నాణ్యతను ఐస్ ప్యాక్లను పరిశీలించారు. రికార్డులను, హాజరు పట్టికను...