భీమ్ గల్, బతుకమ్మ : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ గా విధులు నిర్వహిస్తు పాలసీదారులకు నాణ్యమైన ఇన్సూరెన్సు సేవాలను అందిస్తూ, సకాలంలో క్లెయిమ్ సెటిల్మెంట్ లను అందించి కంపెనీ ఇచ్చిన టార్గెట్లను మించి వ్యాపారం చేసి ప్రెసిడెంట్ గోల్డ్ పురస్కారానికి ఎంపికైన గోపు అంజిని పట్టణ మున్నూరు కాపు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవలే ఆయన థాయ్ ల్యాండ్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ప్రెసిడెంట్ గోల్డ్ పురస్కారాన్ని అందుకోగా గురువారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించి కార్యక్రమం లో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు అంజిని సంఘ సభ్యులు శాలువ, పూలమాలలతో సన్మానించిన, సత్కరించారు. తమ సంఘానికి చెందిన సభ్యుడు అంజి అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకొని పట్టణ, సంఘ కీర్తిని చాటడం గొప్ప విషయమని, ఆయన వర్క్ స్టైల్ అందరు యువతకు స్ఫూర్తిదయాకమని సంఘ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాతని ప్రవీణ్, పతాని లింబాద్రి, మారు పెద్దిగంగాధర్, పతాని కృష్ణ, సుంకరీ సురేష్ ,తోట లింబాద్రి,లింగం, మధు, సుంకరి నరేష్, భూమేష్, పురస్తు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
