27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్ట్..

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : డ్యూటీ లో వున్నా పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన సంఘటన నందిపేట్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.  పోలీసు  సిబ్బంది బుధవారం సాయంత్రం నందిపేట్ నుండి శాపూర్ వేళ్ళు మార్గంలో వాహనాల తనిఖీ చేస్తుండగా షాపూర్ నుండి నందిపేట్ వైపు వస్తున్న హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ ను పోలీసులు ఆపారు. వాహనం నడుపుతున్న పోశెట్టి అనే వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా అ వాహనంపై వెనకాల ఉన్న ఎర్రం పవన్ అనే వ్యక్తి పోలీసువారితో దురుసుగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ట్యాబ్, డిడి మిషన్, పి సి విజయ్  మొబైల్ ఫోన్ లాక్కొని వాటిని  పగలకొట్టి  పోలీసు వారితో వాగ్వావాదాంనికి దిగారు. అతనితో పాటు మరో ఇద్దరు నందిపేటకు చెందిన ఎర్రం చరణ్, ఎర్రం కిరణ్, అనే వ్యక్తులు పోలీసు వారితో గొడవపడి వారి విధులకు ఆటంకపరిచినందుకు ఎస్ ఐ 2 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఎవరైనా పోలీసు ల విధులకు ఆటంకపరచిన  వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తప్పవు అని ఎస్ ఐ శ్యామ్ రాజ్ తెలిపారు.

More articles

Latest article