- నిషేధిత రాయల్ ఎన్ ఫీల్డ్ సైలెన్సర్లు స్వాధీనం
- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో నిషేధిత రాయల్ ఎన్ ఫీల్డ్ సైలెన్సర్లను విక్రయిస్తున్న ఆటో మోబైల్ యజమాని అరెస్టు చేసి సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతున్నారు.. వాటిని బిగిస్తున్నారు.. అనే నమ్మదగిన సమాచారం మేరకు నాలుగు చోట్ల సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్, శివ శంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ సిటీ యాక్ట్ నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లను అమ్ముతున్న శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్ అండ్ కన్సల్టెంట్లలో మొత్తం 08 కొత్త సైలెన్సర్లు అందులో అవి 01) షాట్ పంజా-1 02) ఇండోర్ సైలెన్సర్-7 జప్తు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అమ్ముతున్నటువంటి విజయలక్ష్మి ఆటోమొబైల్స్ అండ్ సర్వీస్ సెంటర్ లలో మొత్తం 10 నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అదేవిధంగా శివశంకర్ ఆటోమొబైల్స్ లో (11) సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్లు జప్తు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

- నిషేధిత సైలెన్సర్లను అమ్మిన.. బిగించిన.. వినియోగించిన కేసుల నమోదు..
నిషేధిత సైలెన్సర్లు అయినటువంటి నిషేదిత పంజాబ్ టైపు సైలెన్సర్లు, షార్ట్ పంజా బ్ఇండోర్ సైలెన్సర్లను అమ్మిన ఆటొ మోబైల్ యజమానులకు, బిగించిన మెకానిక్ లకు, నడిపిన వాహనదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. నిషేధిత సైలెన్సర్లను పట్టుకున్న నిజామాబాద్ నాల్గవ టౌన్ ఎస్ హెచ్ఓ సతీష్, ఎస్ఐ శ్రీకాంత్ లను సిపీ అభినంధించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎసిపీ రాజా వేంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

