27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని గ్రామ అధ్యక్షుడు ఏనుగు మోహన్ అన్నారు. పాలెం గ్రామానికి చెందిన వడ్నలా జలేందర్, ఏలేటి గంగవ్వ, కొమ్ముల విమల కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  అలాగే మంజూరుకు  సహకరించిన ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బ్రహ్మనాయుడు, అంగడి నరేష్, సింగారం అవినాష్,పేట ప్రతాప్, గోరె, హరీష్, గంగన్న, భూమన్నా, మహేష్, రాజ్ మహేష్, రవిశంకర్,శశి, చిరంజీవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సింగారం లక్ష్మీ,అంగడి మమత, మునిరుద్దీన్,మల్లూరి బాబూరావు, ఏనుగు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article