హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న కిరణ్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆయన రూ.3లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్మన్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
