- ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ: యువత చెడు వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ సాయన్న సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాలలో మంగళవారం ఎస్సై సాయన్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కల్పించారు. అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. యువకులు గంజాయి, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీసు సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
