మోర్తాడ్, బతుకమ్మ: మనిషి జీవితం విలువైనదని ఏటువంటి చెడు వ్యస నాలకు అలవాటు కాకూడదు అని కౌన్సిలర్ రాజశేఖర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న డ్రగ్స్ నిర్ములన గురించి మంగళవారం మోర్తాడ్ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జరిగే అనర్దాల గురించి, అలాగే వాటికీ అడిక్ట్ అవడం వల్ల జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. డ్రగ్స్ కు అలవాటు పడితే మీతో పాటు మీ కుటుంబ పరువు పోవడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఎవరైనా మీకు డ్రగ్స్ అలవాటు చేయడానికి ప్రయత్నం చేసిన, అలాంటి వారు కనపడిన 100 నంబర్ కు అయిన లేదా 1908 కు ఫోన్ చేయాలనీ తెలియజేశారు. కార్యక్రమంలో ఎక్సయిజ్ సీఐ గుండప్ప, ఎస్ఐ మానస, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
