30.9 C
Hyderabad
Monday, August 3, 2026

 రైల్వే వాగాన్ ల వద్ధ  యువకుడు దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్ లో నిలిచి ఉన్న రైల్వే వాగాన్ వద్ధ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఓ యువకుడిని ఉరివేసి హతమార్చారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగిన అదివారం అలస్యంగా వెలుగు చూసింది. నగర మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కథనం ప్రకారం వివారాలు ఇలా ఉన్నాయి. మృతుడిని నవిపేట్ కు చెందిన గణేష్ (23) గా గుర్తించారు. శనివారం గణేష్ అతని బావమరిది, అక్క, బావాలు అతని బార్య గోడవల విషయంలో మాట్లడినట్లు తెలిసింది. సాయంత్రం అతని బావమరది తిరిగి వెల్లిన తరువాత గణేష్ మాత్రం రైల్వే వాగన్ ల వద్ధ విగత జీవిగా కనిపించాడు. అతని మెడకు మాత్రం తాడుతో ఉరివేసి చంపినట్లు గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గణేష్ హత్యకు కుటుంబ కలహలే కారణం అని పోలిస్ లు అనుమానిస్తున్నారు.

More articles

Latest article