30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  వాకథాన్

Must read

📰 Generate e-Paper Clip

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  వాకథాన్

 . . .ప్రారంభించిన సీనియర్ వైద్యులు జీవన్ రావు, వెంకట్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, ప్రతిరోజు  తమ దినచర్యలో భాగంగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సీనియర్ వైద్యులు డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వెంకట్ రమణాలు  లు పేర్కొన్నారు. వరల్డ్  హార్ట్  డే సందర్భంగా ఆదివారం మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బందితోపాటు, మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నగరంలో ఆర్ఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా మెడికవర్ ఆసుపత్రి వరకు వాకథాన్ నిర్వహించారు. వాకథాన్  ను ముఖ్య అతిథులుగా  హాజరైన సీనియర్ వైద్యులు జీవన్ రావు, డాక్టర్ వెంకటరమణ లు జెండా ఊపి ప్రారంభించారు.

Walkathon under the auspices of Medicover Hospital

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా  గుండె సంబంధిత వ్యాధులతో అనారోగ్యాలకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే తాము తీసుకునే ఆహారంలో  ఎంతో జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా జంక్ ఫుడ్ లకు  దూరంగా ఉండాలని సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించుకోవచ్చు అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలని  వారు అన్నారు. అలాగే పౌష్టికాహారం, ఒత్తిడిని సాధ్యమైనంత వరకు గుండెకు ఎలాంటి ముప్పు ఉండదని  వారు అన్నారు. అనంతరం మెడికల్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 తేదీన వరల్డ్ హార్ట్ డే ను నిర్వహించుకుంటామని అన్నారు. గతంలో వయసు పైబడిన వారికి మాత్రమే గుండె సంబంధిత వ్యాధులు ఎదురయ్యవని,కానీ ప్రస్తుతం వయసు  తో సంబంధం లేకుండా ముఖ్యంగా యువతకు కూడా గుండె నొప్పులతో బాధపడడం విచారకరమన్నారు. దీన్ని కారణం యువత వారు సమతుల్య ఆహారాన్ని తీసుకోకుండా జంక్ ఫుడ్, మద్యం సేవించడం,  పొగ త్రాగటం ప్రధాన కారణమని ఆయన అన్నారు.  వీటిని తగ్గించుకుంటే గుండె సంబంధిత వ్యాధులను జయించవచ్చనిఆయన అన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ సందీప్ రావు, డాక్టర్ రవి కిరణ్, స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ తో పాటు ఆస్పత్రికి చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Walkathon under the auspices of Medicover Hospital

More articles

Latest article