24.6 C
Hyderabad

ఈర్ల శేఖర్ ను పరామర్శించిన కరిపే రాజు వంజరి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల శేఖర్ ను తెలంగాణ ఉద్యమ కారుడు కరిపే రాజు వంజరి సోమవారరం నగరంలోని వీక్లీ మార్కెట్ లో గల ఆయన నివాసానికి వెళ్లి  పరమార్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు ఈర్ల శేఖర్ కు అండగా  పార్టీలకు అతీతంగా అండగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈర్ల శేఖర్ తెలంగాణ ఉద్యమంలో వందల సార్లు అరెస్ట్ లు, కోర్టు కేసులు, బుల్లెట్ వాటర్ ఫైరింగ్ లాంటి దెబ్బలను తట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా ఉద్యమం చేసిన నాయకునికి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఇసుమంతయిన న్యాయం జరగలేదని అన్నారు. ఈర్ల శేఖర్ లాంటి ఉద్యమకారుల త్యాగాల వల్లే తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోగలిగామని, ప్రతీ ఒక్కరూ మానవతా దృక్పథంతో అండగా నిలవాలని కోరారు. ఈర్ల శేఖర్ ఆరోగ్య పరిస్థితిని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువెళ్లి ఈర్ల శేఖర్ కుటుంబాన్నీ ఆదుకునేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు.

More articles

Latest article