- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనప్పుడు మీకు తెరాస కు తేడా ఏమిటి అని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్ లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. జిల్లాలో మూతపడిన నిజాం షుగర్ ప్యాక్టరీ నీ తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో ఒక సబ్ కమిటీ వేసిందని అన్నారు. ఆ సబ్ కమిటీ నిజాం షుగర్ చక్కెర ఫ్యాక్టరీ పై విచారణ జరిపి సబ్ కమిటీ రిపోర్టును సైతం ప్రభుత్వానికి అందించడం జరిగింది అన్నారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించవచ్చని ఆ కమిటీ చెప్పిందాన్ని తిరిగి ఆ సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ఇటీవల తన సన్మాన సభలో మాట్లాడుతూ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తేరగడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని దానికి ప్రత్యమ్యంగా ఆయిల్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోందని ఆయిల్ పంటలు వేయడానికి రైతులు ముందుకు రావాలని అనడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో బయట పడుతుంది అన్నారు. అదే సభలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అదే విషయాన్ని మాట్లాడం రైతుల్ని మోసం చేయడం కాదా అని భూమయ్య అన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ మేరకు సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ఎన్ఎస్ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ నీ తెరిపించాలని వారన్నారు. దీనితోపాటు తెలంగాణలోనే సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్సిఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపించాలని వారు అన్నారు. ఎన్సీఎస్ఎఫ్ ను బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆగిపోయిన మంచిప్పా21 ప్యాకేజీ పనులను సత్వరమే ప్రారంభించి దాని కింద గల నిజాంబాద్ రూరల్ సెగ్మెంట్ లోనీ 77 గ్రామాల లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని వారు అన్నారు. అందుకుగాను రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణలో విత్తన అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఇవ్వవలసిన 450 కోట్ల రూపాయలను విడుదల చేసి ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు. నేటికి దేశంలో విత్తన చట్టం లేదని దేశంలోనే ప్రైవేటు విత్తన సంస్థలు బహుళ జాతి కంపెనీల విత్తనాల పెత్తనం కొనసాగుతుంది అన్నారు. 90% ఈ సంస్థలే విత్తనాలు సప్లై చేస్తున్నారని అవి నకిలీ విత్తనాలు అవడం మూలంగా రైతులు కన్నీరు కారుస్తున్నారని, రైతులని నకిలీ విత్తనాలతో నిండా మంచుతున్నారని అయినా ప్రభుత్వాలు వారి దోపిడీని అరికట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలని బలోపేతం చేయడానికి తగిన నిధులు కేటాయించి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని వారి కోరారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఉపాధ్యక్షులు ఆగ్గు ఎర్రన్న.బి.సాయిలు. ఆగ్గు చిన్నయ్య.పోశెట్టి. తదితరులు పాల్గొన్నారు.

