24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యే ప్రజలకు వెలుగునిచ్చే దీపం

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యాదానం అన్నిటికంటే గొప్పది
  • విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సిటీ
  • ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

 

జక్రాన్‌పల్లి, బతుకమ్మ: విద్య సర్వరోగ నివారిణి  ప్రతి సమస్యకు పరిష్కారం విద్యలోనే ఉంది” అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. తొర్లికొండ గ్రామ ఉపాధ్యాయుడు జెస్సు వినోద్ కుమార్ పదవీవిరమణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. “అన్ని దానాల కెల్ల విద్యా ధానం గొప్పది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితాలను మార్చేది గురువులే. ఉపాధ్యాయ వృత్తి ఒక మహోన్నతమైన సేవా యజ్ఞం” అని తెలిపారు. అత్యాధునిక ఉద్యోగాల ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే స్కిల్స్ తప్పనిసరి అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీను ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు. “మన విద్యార్థులు ఎక్కడికెళ్లినా తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఉద్యోగాలు సంపాదించగలగాలి… ఇదే మా ప్రభుత్వ లక్ష్యం” అని భూపతిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో విద్యా రంగం నిర్లక్ష్యానికి గురై, విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడ్డారని ఆయన విమర్శించారు. పెండింగ్ బకాయిలను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాధాన్యతగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. పదవీవిరమణ పొందిన జెస్సు వినోద్ కుమార్‌ను అభినందిస్తూ, తెలంగాణ ఉద్యమ కాలంలో తనతో కలిసి పోరాడిన రోజులను ఎమ్మేల్యే స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు జెస్సువినోద్ దంపతులు, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్,  ముప్పగంగారెడ్డి , మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు జి. రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టిఅధ్యక్షుడు జి చిన్నారెడ్డి, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,పిఆర్టియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులునాయకులు అంకం నరేష్, ముఖ్య వ్యాఖ్యాత పోలస రాములు, వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article