విద్యే ప్రజలకు వెలుగునిచ్చే దీపం
విద్యాదానం అన్నిటికంటే గొప్పది విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సిటీ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి జక్రాన్‌పల్లి, బతుకమ్మ: విద్య సర్వరోగ నివారిణి ప్రతి సమస్యకు పరిష్కారం విద్యలోనే ఉంది” అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. తొర్లికొండ గ్రామ ఉపాధ్యాయుడు జెస్సు వినోద్ కుమార్ పదవీవిరమణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. “అన్ని దానాల కెల్ల విద్యా ధానం గొప్పది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితాలను మార్చేది గురువులే. ఉపాధ్యాయ వృత్తి...