29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

19న ఉచిత వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 19న నవజాత శిశువు నుండి పద్దెనిమిది (0-18) సంవత్సరాల వయస్సు గల పిల్లలకు గుండె వ్యాధులకు సంబందించి ఉచిత వైద్య శిబిరం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కె),  అపోలో హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్  ఆద్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జి.జి.హెచ్) కింది అంతస్తులో గల రూమ్ నం: G-31, ( ఐసీటీసీ రూమ్ ఎదురుగ) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు  నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్దారణ అయితే అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ బ్రాంచ్ నందు ఉచితంగా  ఉచితంగా శస్త్ర చికిత్స చేయబడుతుందని తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చేవారు తమ వెంట కొత్త రేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు – పిల్లలది, వారి తల్లి తండ్రులది, పిల్లలది జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్), తల్లి తండ్రులది ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్), మునుపటి ఆరోగ్య రికార్డులు తీసుకుని రావాలని సూచించారు.

More articles

Latest article