19న ఉచిత వైద్య శిబిరం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 19న నవజాత శిశువు నుండి పద్దెనిమిది (0-18) సంవత్సరాల వయస్సు గల పిల్లలకు గుండె వ్యాధులకు సంబందించి ఉచిత వైద్య శిబిరం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కె),  అపోలో హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్  ఆద్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జి.జి.హెచ్) కింది అంతస్తులో గల రూమ్ నం:...