26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తండ్రి జ్ఞాపకార్థం తనయుడి సేవా కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ పాఠశాలకు ఆల్కలైన్ ప్యూరిఫైడ్ వాటర్ మిషిన్ వితరణ

బతుకమ్మ, ఆర్మూర్ : చేపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ హైస్కూల్ కు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను  గడ్డ మీది లింగం గౌడ్ తన తండ్రి కీ, శే ” లైన గడ్డ మీది ఈశ్వర్ గౌడ్ జ్ఞాపకార్థం శనివారం వితరణ చేసారు .ఇందులో భాగంగా 1000 లీటర్ల సామర్థ్యం గల ఆల్కలైన్ ప్యూరిఫైడ్ మినరల్‌ వాటర్‌ మిషిన్ ను పాఠశాల్లో ఏర్పాటు చేయించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ వి రవి కుమార్. ఏం ఈ ఓ రాజ గంగారాం రిషిత హాస్పిటల్ అధినేత డాక్టర్ వెంకట్ గౌడ్. రవి గౌడ్ లు హాజరై ప్యూరిఫైడ్ ఆల్కలైన్ వాటర్ మిషను వారి చేతుల మీదుగా  ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ కావాలని లింగం గౌడ్ ను సంప్రదించగానే ముందుకొచ్చి అలకలైన్ ప్యూరిఫైడ్ వాటర్ ను ఏర్పాటు చేసి తాగునీరు సమస్య ను విద్యార్థినీ విద్యార్థులకు తీర్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మూడు తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని,  అమ్మ ఆదర్శ కమిటి పథకంలో టెన్స్ సాంక్షన్ అయినయి మూడు తరగతి గదులను బాగు చేయడానికి ఎవరైనా ముందుకొచ్చి తరగతి గదులను బాగు చేయించాలని కోరారు. దీంతో మాజీ ఎంపీటీసీ జన్నెప్పల్లి గంగాధర్ ముందుకొచ్చి తను బాగు చేయిస్తానని  తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న,  మాజీ ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మాజీ ఉప సర్పంచ్ డిష్ రాజు, సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగి శాంతి కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు చిట్యాల పోశెట్టి, దాసరి నాగరాజు, టెలికాం జిల్లా డైరెక్టర్ మీ సేవ షాహిద్, ఎల్క రంజిత్,  సోఃఖం సంజీవ్, డాక్టర్ శంకర్ దాస్, గడ్డమిది కిషన్ గౌడ్, ఉపాధ్యాయులు అశోక్, మహేందర్, రవి, గంగాధర్, సాయ,న్న గ్రామ పెద్దలు,  యువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article