29 C
Hyderabad
Monday, August 3, 2026

అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం అందించాలి 

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ పిట్లం : అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందించాలని బాన్సువాడ ప్రాజెక్టు సిడిపిఓ సౌభాగ్య తెలిపారు. పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో శనివారం నెలవారీ మీటింగ్ నిర్వహించారు. .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించాలని, ప్రీస్కూల్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అంగన్వాడి టీచర్లు సమయపాల పాటించాలని, అంగన్వాడి సెంటర్లను ప్రతిరోజు శుభ్రతగా ఉండే విధంగా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ షాహినజ్,రాంపూర్(కలన్)సెక్టర్ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

More articles

Latest article