29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వన్ వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : దేవి రోడ్డు లోని వన్ వే ను క్షేత్రస్థాయిలో కాలినడకన నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాదు లో అత్యంత రద్దీ రోడ్డు అయినా దేవీ రోడ్డు లో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతున్నందున ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత మూడు నెలల నుంచి వన్ వే ను ట్రాఫిక్ పోలీస్ వారు  ప్రారంభించారు. దేవి రోడ్డు నందు గల వన్ వే ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య కాలినడకన గురువారం సాయంత్రం దేవీ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన గల ఫ్లై ఓవర్ నుంచి ఎల్.వి.ఆర్ వరకు గల రోడ్డు, దేవి రోడ్డు నుంచి కిసాన్ గల్లి గంజ్ కు వెల్లు రోడ్డు, గాంధీ చౌక్ నుంచి గంజ్ వరకు గల రోడ్ల లో కలియ తిరిగి సమీక్షించారు. ఈ సమీక్షలో కమిషనర్ ప్రజలతో మమేకమై వన్ వే వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా ఎంత వరకు ప్రయోజనం ఉన్నది తెలుసుకోవడానికి ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించారు. సిపి వెంట  ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ,  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిబ్బంది  ఉన్నారు.

CP inspected One Way at the field level

CP inspected One Way at the field level

More articles

Latest article