హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని నాంపల్లిలో గల చేనేత భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం పదిన్నర వరకు కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించారు. ఈసందర్భంగా సమయ పాలన పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
