25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కిశోర బాలికలకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్:  మోర్తాడ్ మండల కేంద్రంలోనీ అంగన్వాడి కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కిశోర బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి విషయాలపై ప్రాక్టికల్ గా చూపిస్తూ డీ హెచ్ఈ డబ్ల్యు జిల్లా కోఆర్డినేటర్ పుష్పలత అవగాహన కల్పించారు.
గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసుకోవాలి..
గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజుల అన్నారు. సెప్టెంబర్ నెల పోషణ మాసం సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని అంగన్వాడీలో కేంద్రంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆహార విషయంలో బాలింతలు, గర్భిణీలు, నవజాత శిశువులు, కిషోర్ బాలికలు ఎటువంటి పోషక పదార్థాలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిల్లలకు టీకాలు వేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రసన్న, అంగన్వాడి టీచర్లు జ్యోతి, గంగజమున, సువార్త, శారద,అంజమ్మ, రాజేశ్వరి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article