25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు

Must read

📰 Generate e-Paper Clip

. . . ఇసుక మాఫియా తో అధికారుల కుమ్మక్కయ్యారని గ్రామస్తుల ఆరోపణ

 

బతుకమ్మ, కోటగిరి :

 

అనుమతుల పొందిన చోటు నుండి కాకుండా కొడిచర్ల శివారు లోని మంజీరా నది అక్రమ ఇసుక ను తప్పుడు వే బిల్లులతో టిప్పర్ల ద్వారా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పోతంగల్ గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులను కొందరు అధికారులు ఇసుక మాఫియా తో చేతులు కలిపి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ గంగాధర్, మైనింగ్ అధికారులు వచ్చేంతవరకు కదిలేది లేదంటూ భీష్మించక కూర్చున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అధికారుల అండదండలతోనే విచ్చలవిలుగా నడుస్తుందని వాపోయారు. పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో వ్యవసాయ భూములు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ లక్షలలో దండుకుంటున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇంటికి ఇసుక కావాలంటే ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని అంతే తప్ప టిప్పర్ల ద్వారా తరలించేందుకు వీల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Villagers block sand tippers

More articles

Latest article