కోటగిరి,బతుకమ్మ : కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో అడికేశ్ లింగమయ్య దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత, ఆలయ కమిటీ అధ్యక్షులు, ముమ్మలనేని రాజశేఖర్ కు పోచారం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కోటగిరి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

