24 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీరామసాగర్ ప్రాజెక్ట్‌ లో వాలీబాల్ పోటీల నిర్వహణ

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం మెండోరా పోలీస్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ క్రీడ నిర్వహించడం జరుగుతుందని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. “ఈ క్రీడ యొక్క ప్రధాన ఉద్దేశ్యం యువతను చెడు వ్యసనాల నుండి, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వంటి ప్రమాదకర అలవాట్ల నుండి దూరంగా ఉంచడం. ఈ రోజుల్లో యువత అనవసర వ్యసనాల వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని. వ్యసనాలకు దూరంగా ఉండటం కోసం మా దగ్గర ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రీడలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అని తెలిపారు. అలాగే, “క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయి. ఇవి మంచి జీవితం గడపడానికి దోహదం చేస్తాయి,” అని పేర్కొన్నారు. ఈ వాలీబాల్ క్రీడలో మెండోరా మండలం లోని పోచంపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించబడనుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శోభ, స్థానిక నాయకులు గంగారెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article