ఇందల్ వాయి, బతుకమ్మ : చెట్టును లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం 6గంటలకు అన్సాన్ పల్లి నుంచి ఇందల్ వాయి వైపు వస్తున్న లారీ లింగాపూర్ స్టేజీ వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. మంచిర్యాల కాశీపేటకు చెందిన లారీ డ్రైవర్ బిస్మిల్లాఖాన్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
