24 C
Hyderabad
Sunday, August 2, 2026

మొలకెత్తిన ధాన్యం

Must read

📰 Generate e-Paper Clip

  • ఆత్మహత్యలే మాకు శరణ్యం : రైతులు
  • ప్రభుత్వం ఆదుకోవాలి        

 

చందూరు, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా చందూరు, మోస్రా మండలంతో పాటు ఇతర చుట్టుపక్క గ్రామాలలో రైతులు పండించిన వరి ధాన్యం విక్రయించడం కోసం రోడ్డుపై ఇతర చోట్ల ఆరబోశారు. తుఫాను ప్రభావం వర్షం కురియడంతో పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ధాన్యంకు మొలకలు వచ్చాయి. మొలుకలు వచ్చిన ధాన్యం  సొసైటీ వారు మరోవైపు ఐకెపి వారు కొనుగోలు చేయటం లేదని మహిళా రైతులు తమ గోడును విన్నవించారు. సుమారు మూడు ఎకరాలతో పాటు మరికొన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే పండించిన ధాన్యం విక్రయించడం కోసం రోడ్డుపై ఆరబోస్తే వర్షం వచ్చి తడిసి మొలకలు వచ్చినాయి అని మొలకలు వచ్చిన ధాన్యం సొసైటీ వారు ఐకెపి వారు కొనుగోలు చేయడం లేదని ఇలాగైతే మా పరిస్థితి ఏమిటని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటలు సాగులో ఉన్నప్పుడే లేనిపోని వ్యాధులు వచ్చి అదే విధంగా వర్షం రావడం వల్ల దిగుబడి ఘననీయంగా తగ్గిపోయిందని ఓవైపు దిగుబడి తగ్గడమే కాకుండా మరోవైపు వర్షం వచ్చి ధాన్యం మొలకెత్తుతున్నాయని ఈ ధాన్యం ఎవరు కొనుగోలు చేయడం లేదని అప్పు, వడ్డీ పెరిగి మాకు ఆత్మహత్యలు శరణమని ఈ పరిస్థితిలో తమ ధాన్యం కొనుగోలు చేసి మాకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే పరిస్థితి రెండు మండలాలతో పాటు ఇతర చోట్ల రైతులు అనుభవిస్తున్నారని. రైతులకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం పై ఉందని పలువురు కోరుతున్నారు.

Sprouted grain

Sprouted grain

More articles

Latest article