24.7 C
Hyderabad
Monday, August 3, 2026

డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిర్భయ కేసు

Must read

📰 Generate e-Paper Clip

  • మహిళకు లైంగిక వేదింపులపై

 

నిజామాబాద్, బతుకమ్మ :  మహిళను లైంగికంగా వేదిస్తున్న డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై 4వ టౌన్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. గత కొంత కాలంగా మహిళకు ఫోన్ చేసి న్యూడ్ కాల్ కు 5 వేలు, గెస్ట్ హౌజ్ కు వస్తే 10 వేలు అని ఫోన్లు చేస్తూ వేదిస్తున్నారని మహిళ సోమవారం పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు ఆదేశించడంతో మంగళవారం 4వ టౌన్ పోలీసులు డాక్టర్, రియల్ఎస్టేట్ వ్యాపారిపై నిర్భయ కేసు నమోదు చేశారు. నగరంలోని ద్వారకనగర్ లోని స్మయిల్ 32 ఆసుపత్రి వైద్యులు డా. కొండ అమర్ నాథ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయిల్ గంగాధర్ లపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

More articles

Latest article