30.2 C
Hyderabad

మహిళను దోచుకున్న ఆటోడ్రైవర్

Must read

📰 Generate e-Paper Clip

  • మహిళ పుస్తెల  తాడును లాక్కుని పరారీ
  • సహకరించిన ఇద్దరు మహిళలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రయాణికుల  మాదిరిగా ఆటోలో కూచున్న ఇద్దరు మహిళలు ఆటో డ్రైవర్ తో కలిసి ప్రయాణికురాలు బంగారు  గోలుసును లాక్కుని పరారీ అయ్యారు.  ఈ సంఘటన శుక్రవారం జరిగింది. మూడో టౌన్ ఎస్ఐ  మహేష్ కథనం ప్రకారం వివరాలు  ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలం ఒడ్యాట్ పల్లి గ్రామనికి చెందిన భూలక్ష్మి అనే మహిళ సొంత గ్రామానికి వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కింది. ఆటోను ఆర్మూర్ రోడ్డువైపు తీసుకెళ్లకుండా కంఠేశ్వర్ బైపాస్ ద్వారా గౌతం నగర్ వైపు మళ్లించారు. అప్పటికే ఆటో ఉన్న మరో ఇద్దరు మహిళలు భూలక్ష్మీ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కుని బయటకు నెట్టేసి ఆటోలో పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

More articles

Latest article