25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డిపేటలో రైతన్నల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

  • రైస్ మిల్లు యాజమాన్యం 5 రోజులైనా ధాన్యాన్ని దించుకోవడంలేదని ఆవేదన.
  • తహాసిల్దార్ ఆఫీస్ ముందు ధాన్యం లారీ తో నిరసన

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైస్ మిల్ యజమాన్యం తీరును నిరసిస్తూ ధాన్యంలోడుతో ఉన్న లారీని ఆఫీస్ ముందు తీసుకువచ్చి నిరసన తెలిపిన రైతులు.. ఈ సందర్భంగా రైతులు అకాల వర్షంతో అన్నదాతలు నష్టపోతున్నారని తేమశాతం 17 వచ్చి వరి ధాన్యాన్ని తూకం వేసి లారీలో రైస్ మిల్ కు తరలిస్తే రైస్ మిల్ యజమాన్యం అయిదు రోజుల నుండి తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ కార్యాలయం ముందు కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై లారీని అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు. రైతన్నల నిరసనకు బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. వెంకటాపూర్ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ తన వడ్లు తేమశాతం 17 రావడంతో కాంట నిర్వహించామని తనకు సంబంధించిన 600 బస్తాలు మిగతా రైతులకు సంబంధించినవి 400 బస్తాలను లోడ్ చేసి  గొల్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్ కు ధాన్యాన్ని పంపిస్తే ఐదు రోజులైనా ధాన్యాన్ని దించకపోవడంతో తిరిగి ధాన్యంలోడును పంపించారని లారీ లోడులో 15 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కట్ చేస్తామని రైతులే స్వయంగా వచ్చి తెలుపాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షంతో ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం తడిసిపోతుందని ఇటువైపు రైతులను రైస్ మిల్ యజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు.. ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని తూకం వేయాల్సిందిగా రైతులు డిమాండ్ చేశారు.. ధర్నా కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, పారిపెల్లి సంజీవరెడ్డి, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Farmers' protest in Yellareddypet

More articles

Latest article