మోర్తాడ్, బతుకమ్మ: పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో ఉచిత గాలికుంటూ నివారణ టీకాల కార్యక్రమంను జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా. రోహిత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి గ్రామంలో పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. పశు వైద్యాధికారి గౌతమ్ రాజ్ ఈ కార్యక్రమంలో భాగంగా 113 పశువులకు (ఆవులు, గేదెలు) ఉచిత గాలికుంటు టీకాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు సాగర్, గంజల నవీన్, పోతుగంటి సంతోష్,బబ్బూరు ముత్యం , ప్రభాకర్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.
