30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయి కుటుంబాల కుల బహిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

  •  మూడేళ్లుగా బహిష్కరణ ను ఎదుర్కొంటున్న ఐదు గౌడ కుటుంబాలు
  •  ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం

బతుకమ్మ, మాచారెడ్డి:  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్ల రాజేందర్ గౌడ్ కూతురు దళిత అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న అగ్రహంతో అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలను మాచారెడ్డి గౌడ కుల సంఘ పెద్దలు వెలివేశారు. మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఎన్ని విధాలుగా గౌడ సంఘం ప్రతినిధులను బ్రతిమాలినప్పటికీ ససేమిరా అంటున్నారు. అంతటితో ఆగకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ ఐదు కుటుంబాలతో గౌడ కులస్తులు ఎవరైనా మాట్లాడినా, మంచి చెడులకు పిలిచిన వారికి 50 వేల జరిమానా విధిస్తామని కులసంఘ పెద్దలు తీర్మానించారు. 2021 నుండి ఇప్పటి వరకు సంఘంలో గాని, కులం లో గాని మంచి చెడులకు తమ కుటుంబాలను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ విషయమై గతంలో రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని భాదితులు వాపోయారు. తిరిగి ఈ నెల 23 న మరో మారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భాధితులు పిర్యాదు చేశారు. తమను కులంలో కలుపుకొని మాచారెడ్డి గౌడ సంఘం ఆస్తుల్లో తమ భాగస్వామ్యం తమకు ఇప్పించాలని భాధితులు కోరుతున్నారు . తమ అస్తులపైన కూడా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వాపోయారు. , గౌడ సంఘం పెద్దలతో తమకు ప్రాణహాని ఉందని, అధికార యంత్రాంగం తమ గోడును పట్టించుకొని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

More articles

Latest article