కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయి కుటుంబాల కుల బహిష్కరణ

 మూడేళ్లుగా బహిష్కరణ ను ఎదుర్కొంటున్న ఐదు గౌడ కుటుంబాలు  ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం బతుకమ్మ, మాచారెడ్డి:  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్ల రాజేందర్ గౌడ్ కూతురు దళిత అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న అగ్రహంతో అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలను మాచారెడ్డి గౌడ కుల సంఘ పెద్దలు వెలివేశారు. మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఎన్ని విధాలుగా గౌడ సంఘం ప్రతినిధులను బ్రతిమాలినప్పటికీ ససేమిరా అంటున్నారు. అంతటితో ఆగకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బాధిత...