28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మాకు ఆదర్శం.. మాకు మార్గదర్శి సురేందర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఉపాధ్యాయుడిగా సురేందర్ రెడ్డి మీ సేవా ప్రస్థానం అనేకమంది విద్యార్థులకు మార్గదర్శకంగా, ప్రేరణగా, ఆదర్శంగా మార్గదర్శిగా నిలిచారని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్ అన్నారు. చేసే పని దైవముగా భావించి క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం ప్రతి ఒక్కరినీ ప్రేరేపించిందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో 37 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి లో సాంఘిక సంక్షేమ గురుకుల బారుల పాఠశాలలో సురేందర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలనంద చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మాధవరావు, సాంఘిక సంక్షేమ గురుకుల బార్ల పాఠశాల ప్రిన్సిపల్ శివరాం నాయక్, 2000-21 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Our role model.. our guide Surender Reddy

More articles

Latest article