మాకు ఆదర్శం.. మాకు మార్గదర్శి సురేందర్ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ : ఉపాధ్యాయుడిగా సురేందర్ రెడ్డి మీ సేవా ప్రస్థానం అనేకమంది విద్యార్థులకు మార్గదర్శకంగా, ప్రేరణగా, ఆదర్శంగా మార్గదర్శిగా నిలిచారని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్ అన్నారు. చేసే పని దైవముగా భావించి క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం ప్రతి ఒక్కరినీ ప్రేరేపించిందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో 37 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి లో సాంఘిక సంక్షేమ గురుకుల బారుల పాఠశాలలో సురేందర్ రెడ్డి పదవి విరమణ...