26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు

Must read

📰 Generate e-Paper Clip

  • వైస్ చైర్మన్ పరమేష్ పటేల్

 

మద్నూర్, బతుకమ్మ: శుక్రవారం మొఘ గ్రామం నందు పశు వైద్య, పశు సంరక్షక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంట వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ హాజరవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా జరుగుతున్న టీకా అందరూ పశువులకు తీసుకొచ్చి  టీకాలు వేయించి పశు పాలకులు పాల్గొని  విజయవంతం చేశారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలికుంట వ్యాధినిరోధక టీకా వివరాలు ఆవులు  109 అలాగే ఎడ్లు 52, గేదెలు 45, దూడలు మరియు లేగలు 37 మొత్తం 240 రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బంది డాక్టర్ ఎం.వినీత్ కుమార్ మండల పశు వైద్యాధికారి డోంగ్లీ అలాగే సయ్యద్ మున్వీర్ అలీ పశువైద్య సహాయకులు,జి శేఖర్ దావకాన సాయకుడు, జి సైయాజీ గోపాలమిత్ర,జె నాగనాథ్ గోపాలమిత్ర, కె చంద్రశేఖర్ పశు మైత్రి మొఘ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

More articles

Latest article