రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ బిల్లుల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మండల నాయకులు పత్తి రాము, నేరుగంటి బాల్ రాజ్, పత్తి లక్ష్మణ్, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
