29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

లయన్స్ క్లబ్ వేదిక సమాజ సామాజిక సేవ చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • నూతన లయన్స్ క్లబ్ కార్యవర్గ శపథం

 

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలో ఇటీవలే నూతనంగా 21 మంది సభ్యులతో ఏర్పడ్డ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం తాము ఈ లయన్స్ క్లబ్ వేదిక సమాజ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని శపథం చేశారు. క్లబ్ ఏర్పాటుతో పాటు గురువారం ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో భాగంగా పడాల పురందర్ ను ప్రెసిడెంట్ గా, గజ్జెల చైతన్యను సెక్రటరీగా, ఎడ్ల శేఖర్ లను ట్రెజరర్గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లు మాట్లాడుతూ ఇప్పటి వరకు మనకు సమాజం ఎంతో చేసిందని ఇక నుండి క్లబ్ ద్వారా సామాజిక సమాజ సేవలను నిర్వర్తిస్తామన్నారు. ఈ క్లబ్ సభ్యులందరం ఒక కుటుంబంలో ఈ సేవ కార్యక్రమాలను నిర్వీరమంగా కొనసాగిస్తామన్నారు. ఈ అంతర్జాతీయ క్లబ్ లో సభ్యత్వం తీసుకోవడం ఒక విషయం అయితే ఇలాంటి అంతర్జాతీయ సంస్థ వేదికగా మానవ సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయమన్నారు. ఈ క్లబ్ ద్వారా ఉచిత నేత్ర పరీక్ష, శస్త్ర చికిత్సలు నిర్వహించడం, వైద్య శిబిరాలు, రక్త దాన శిబిరాలను నిర్వహిస్తామన్నారు. పేద విద్యార్థులకు సహాయం అందించడం, వృద్దాశ్రామాల్లో సేవ చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం లాంటి అనేక మానవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. లయన్స్ క్లబ్ ఏర్పాటు, కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన లయన్స్ జిల్లా గవర్నర్ ఏ. అమరనాథ్ రావు, రీజినల్ చైర్మన్ రాజన్న, జోనల్ చైర్మన్ పృథ్వీరాజ్, ఎక్సటన్షన్ చైర్మన్ పి. సుధీర్ బాబు,కె. సూర్య నారాయణలకు కార్యవర్గం ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో, పీఆర్వో  పురస్తు లింబాద్రి,ఉపాధ్యక్షులు హన్మండ్లు,, రమావత్ శ్రీకాంత్ ,భూక్యా లింబాద్రి, బర్ల సాగర్, ర్యాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article